రాయదుర్గం: చంద్రబాబు ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేని దద్దమ్మలు వైసిపి నాయకులు : ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు
చంద్రబాబు ను ఎందుకు అరెస్టు చేశారో చెప్పలేని దద్దమ్మ పాలకులు ఆనాటి వైసిపి నాయకులని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు విమర్శించారు. బుధవారం డి.హిరేహాల్ మండలంలోని నాగలాపురం గ్రామంలో నిజం గెలిచింది పేరుతో ఆనాటి చంద్రబాబు అరెస్టును స్మరించుకుని కాగడాల ప్రదర్శన చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆనాడు లక్షల మంది రోడ్డుపై వచ్చారని గుర్తు చేశారు. 164 స్థానాలలో తిరుగులేని విజయం సాధించిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందన్నారు.