ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లోని పాఠశాలల్లో ఆల్ బెండజోల్ మాత్రల పంపిణీ
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాల్లో శుక్రవారం ఆల్ బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. బెలుగుప్ప ZPHS స్కూల్ నందు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం పీహెచ్సీ Dr. ప్రియాంక ఆధ్వర్యంలో 1-19 ఏళ్లలోపు ఉన్న అంగన్వాడి వారి కేంద్రాలు, స్కూల్స్, కాలేజీలకు, కేజీబీఎస్ స్కూల్ లకు ఉచితంగా ఆల్బండంజల్ మాత్రలు భోజనం చేసిన తర్వాత మాత్రలు తీసుకోవాలని తెలియజేసినారు, ముఖ్యంగా' నులి పురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరోచనాలు,రక్తహీనత , ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ 400 MG మాత్రలతో నులి పురుగులను నివారించవచ్చని వైద్యులు పేర్కొన్నారు.