ఉరవకొండ: శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ మంజునాథ స్వామి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సందర్భంగా బుధవారం రాత్రి అమ్మవారు చండి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి మహిళలు సామూహికంగా పాల్గొని ప్రత్యేక పూజలు పారాయణ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయం వద్ద సేవా కమిటీ సభ్యులు దాతలు కలిసి తీర్థ ప్రసాద కార్యక్రమాలను నిర్వహించారు.