కనిగిరి: డీజీ పేటలో వృద్ధురాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్, మారనాయుధాలు, బంగారు ఆభరణాలు స్వాధీనం: SP హర్షవర్ధన్ రాజు
సి.ఎస్.పురం మండలం డి.జి.పేటలో ఆగస్టు 18న చోటుచేసుకున్న వృద్ధురాలు పావలీ వెంకటసుబ్బమ్మ (60) హత్య కేసులో నిందితుడు పావని సురేష్‌ను పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాధి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుర్వ్యసనాలకు బానిసైన సురేష్, బంగారు ఆభరణాల కోసం వెంకటసుబ్బమ్మపై బండరాళ్లతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు సంచలన నిజాలు బయటపెట్టాడని, ప్రస్తుత హత్యతో పాటు 2004లో ఇదే గ్రామంలో మిస్టరీగా మిగిలిపోయిన మరొక మహిళ హత్యను కూడా తానే చేసినట్లు అంగీకరించాడన్నారు.