ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యాచరణ పై వైయస్సార్సీపి శ్రేణులకు దిశ నిర్దేశం
అనంతపురం జిల్లా ఉరవకొండలోని వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతలతో గురువారం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ అభ్యర్థులు, మద్దతు అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.