రాయదుర్గం: పట్టణంలో విషాదం, పాముకాటుకు యువతి మృతి
రాయదుర్గం పట్టణంలోని కణేకల్లు రోడ్డు భగత్ సింగ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. పెంకుటింట్లో కుటుంబ సభ్యులు, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న పి.ఆయేషా (26)ను ఆదివారం రాత్రి త్రాచుపాము కాటేసింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన ఆమె కుటుంబ సభ్యులకు చెప్పడంతో వెంటనే రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బళ్లారి విమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో మృతి చెందింది. మృతురాలి భర్త జగలూరులో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తల్లి మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారడం స్థానికంగా కలచివేసింది.