సంతనూతలపాడు: ఉప్పుగుండూరు చెరువుకు జలకళ,భారీగా వచ్చి చేరుతున్న నీరు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు, స్థానికులు
నాగు నొప్పులపాడు మండలంలోని ఉప్పుగుండూరు లోని ప్రధాన చెరువు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక నీరు అడుగంటింది. దీంతో సాగునీటి కోసం రైతులు, తాగునీటి కోసం ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుండి కాలువల ద్వారా నీరు భారీగా ఉప్పుగుండూరు మంచినీటి చెరువుకు వచ్చి చేరుతుంది. దీంతో చెరువు జలకళ ను సంతరించుకుంది. చెరువు నిండుతూ ఉండడంతో రైతులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తొలగినట్లేనని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.