సంతనూతలపాడు మండలం మంగమూరులోని అంగన్వాడి కేంద్రాన్ని సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు విద్యాబోధన ఏ విధంగా కొనసాగుతుందో అంగన్వాడి టీచర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి సరఫరా అయిన పౌష్టికాహారం వివరాల రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలని ఎంపీడీవో ఆదేశించారు.