కనిగిరి: చంద్రశేఖరపురం మండలం డిజిపేటలో వృద్ధురాలి హత్య, పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు
చంద్రశేఖరపురం మండలం డిజి పేటలో వృద్ధురాలు పావలి వెంకటసుబ్బమ్మ ను గత గురువారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసు విషయంలో స్వయంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సంఘటన స్థలాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ కేసు విషయంలో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు వృద్ధురాలి సమీప బంధువు పావలి సురేష్ ను బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.