నారాయణపేట్: నారాయణపేట: మరణించిన హోంగార్డు బాలకృష్ణ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన ఎస్పీ
నారాయణపేట జిల్లాలో గుండెపోటుతో మరణించిన హోంగార్డు బాలకృష్ణ కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. పోలీస్ వెల్ఫేర్ నిధి నుంచి 15,000 రూపాయల పరిహారాన్ని ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.