ఉరవకొండ: మహాలయ పౌర్ణమి పురస్కరించుకుని జోకుమారుడు స్వామికి గ్రామాల్లో ప్రత్యేక పూజలు
అనంతపురం జిల్లా ఉరవకొండ బెలుగుప్ప తదితర గ్రామాల్లో మహాలయ పౌర్ణమి పురస్కరించుకొని జూ కుమారుడు స్వామికి గ్రామాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. శుక్రవారం బెలుగుప్ప గ్రామంలో కొందరు మహిళలు గంపలో కొలువుదీరిన జోకుమారుడు స్వామిని గ్రామంలోని ఇంటింటికి తీసుకెళ్లి పాట పాడుతూ పూజలు నిర్వహింప చేశారు. మహాలయ పౌర్ణమికి కరువు పీడిత ప్రాంతాలను సుభిక్షంగా ఉంచాలని జోకుమారుడు స్వామి పూజలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టు గ్రామస్తులు, మహిళలు పేర్కొన్నారు.