రాయదుర్గం: పాస్టర్లకు ఫెలోషిప్ అందజేసిన జీసెస్ కాలింగ్ మినిస్ట్రీస్
అనంతపురం జిల్లా సహా వివిధ రాష్ట్రాల్లో సేవలందిస్తున్న పాస్టర్లకు జీసెస్ కాలింగ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గురువారం రాయదుర్గం రాజీవ్ గాంధీ కాలనీలో ఐడీ కార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. జెసిఎం అధ్యక్షుడు సల్మాన్ హంపన్న చేతుల మీదుగా సత్కరించారు. గ్రామ స్థాయిలో సేవలందిస్తున్న పాస్టర్లకు అండగా ఉంటామని, సహోదర బావం పెంపొందించేందుకు, చర్చిల నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని హంపన్న తెలిపారు.