కనిగిరి: గడ్డమీద పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం, నలుగురికి తీవ్ర గాయాలు
కనిగిరి మండలం గడ్డమీదపల్లి సమీపంలో శనివారం రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న బైక్ వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకులపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం కనిగిరి లోని ఆసుపత్రికి తరలించారు.