నారాయణపేట్: నారాయణపేట డిగ్రీ కళాశాలలో అధిక ఫీజుల వసూలుపై పి.డి.ఎస్.యు నిరసన
నారాయణపేటలోని శ్రీ చిట్టెం నర్సిరెడ్డి మెమోరియల్ డిగ్రీ కళాశాలలో పెంచిన సెమిస్టర్, బయోమెట్రిక్ మరియు రీకౌంటింగ్ ఫీజులను తగ్గించాలని పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఫీజులు తగ్గించకుంటే పాలమూరు యూనివర్సిటీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.