రాయదుర్గం: ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్ జీనత్
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చి ఆదర్శంగా నిలిచారు రాయదుర్గం 31వ వార్డు AIMIM కౌన్సిలర్ జీ. జీనత్. వార్డులో చాలాకాలంగా ఉన్న తాగునీటి సమస్య తీరుస్తానని ప్రచారంలో హామీ ఇచ్చిన ఆమె, గెలిచిన వెంటనే పనులు ప్రారంభించారు. ఆమె భర్త, MIM పట్టణ అధ్యక్షుడు బ్రెడ్ సర్మాస్ వలి తన సొంత నిధులతో బోరు వేయించేందుకు ముందుకు రావడం విశేషం. బోరు తవ్వకాల్లో సమృద్ధిగా నీరు పడటంతో వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నీరు పడిన అనంతరం హిందూ సంప్రదాయం ప్రకారం గంగపూజ నిర్వహించి ప్రత్యేక హారతి ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది. ప్రజల దాహం తీర్చడమే నిజమైన సేవ అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.