తల్లాడ: ఖమ్మం జిల్లాలో ఎల్నినో ఎఫెక్ట్: ఎండిపోతున్న పత్తి, వరి పంటలు
ఖమ్మం జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల లక్షన్నర ఎకరాల్లో సాగు నిలిచిపోయింది. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఎల్నినో ప్రభావంతో పంటలు ఎండిపోతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.