రాప్తాడు: రామినేపల్లి 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో రాప్తాడు మండలానికి చెందిన కానిస్టేబుల్ మల్లికార్జున తీవ్రంగా గాయపడి మృతి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి 44వ జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో కానిస్టేబుల్ మల్లికార్జున రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ వెంకటేష్ తెలిపిన సమాచారం మేరకు రాప్తాడు కు చెందిన కానిస్టేబుల్ మురళి ధర్మవరంలో విధుల్లో హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంలో బైక్ పై వెళుతున్న మల్లికార్జున కుక్క అడ్డు రావడంతో తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తు రోడ్డు మృతి చెందడం జరిగింది మృతి చెందిన కానిస్టేబుల్ మల్లికార్జున కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని సీఐ వెంకటేష్ పేర్కొన్నారు.