కనిగిరి: మోట్రావులపాడు లో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి బండ్ల ఊరేగింపు మహోత్సవం
మార్కాపురం జిల్లా పామూరు మండలం మోట్రావులపాడు లో శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం ఆలయ కమిటీ నిర్వాహకులు మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీ పోలేరమ్మ తల్లి బండ్ల ఉత్సవంలో భాగంగా ప్రత్యేకంగా అలంకరించిన బండ్లపై శ్రీ పోలేరమ్మ తల్లి విగ్రహాలు, చిత్రపటాల నుంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పు వైద్యలతో, బాణసంచా మోతులతో కోలాహలంగా పోలేరమ్మ తల్లి బండ్ల ఊరేగింపు కార్యక్రమం కొనసాగింది. భక్తులు పోలేరమ్మ తల్లిని దర్శించుకుని, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి పూజలు చేశారు.