రాయదుర్గం: పులకుర్తి గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు దుర్మరణం
డి.హిరేహాల్ మండలంలోని పులకుర్తి గ్రామ సమీపంలో రెండు కార్లు డీకొన్న ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సంజీవరాయుని కోటకు చెందిన మల్లికార్జున రెడ్డి, మరికొందరు కారులో గురువారం బళ్ళారి కి వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు డీకొనింది. ఈ ప్రమాదంలో మల్లికార్జున రెడ్డి అతని వాహన డ్రైవర్ చాంద్ బాషా మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.