రాయదుర్గం: మానవహక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షుడిగా మామడూరు సురేష్ రెడ్డి ప్రమాణం
*రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం - NHRPF జిల్లా అధ్యక్షుడు సురేష్ రెడ్డి* జాతీయ మానవహక్కుల పరిరక్షణ సంస్థ (NHRPF) జిల్లా అధ్యక్షుడిగా రాయదుర్గానికి చెందిన మామడూరు సురేష్ రెడ్డి శనివారం అనంతపురం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీఈవో తూము రామచంద్ర నాయుడు, ఉపాధ్యక్షులు బిఎస్ కృష్ణారెడ్డి, ఉమెన్ వింగ్ అధ్యక్షులు మాదవిలత ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడిగా పెద్దముడి నరేష్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా కాపు ఉమేష్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా దిలీప్ కుమార్, కార్యవర్గ సభ్యులుగా ఆనంద్ ప్రయాణం చేశారు.