కనిగిరి: పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమం, పరిసరాల పరిశుభ్రత పట్ల స్థానికులకు అవగాహన
కనిగిరి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని శివనగర్ కాలనీ మరియు మోడల్ స్కూల్ ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో కలిసి కనిగిరి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జంషీర్, తెలుగు యువత అధ్యక్షులు సురేష్ రెడ్డి, పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పట్ల స్థానికులకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని, లేకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని స్థానికులను హెచ్చరించారు.