రాప్తాడు: హంపాపురం గాండ్లపర్తి కొత్తపల్లి బుక్కచెర్ల గ్రామంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో హంపాపురం కొత్తపల్లి గ్రామాల్లో మంగళవారం 11:30 నుంచి 2 గంటల వరకు పోలింగ్ కేంద్రాలను రాప్తాడు ఎంపీడీవో విజయలక్ష్మి ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో విజయలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని హంపాపురం బుక్కచెర్ల గాండ్లపర్తి గొల్లపల్లి బొమ్మపర్తి తదితర గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఆ పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు విద్యుత్ పరిసరాలు పరిశుభ్రత ఇతర అంశాల నెట్టి పరిశీలించి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని ఎంపీడీవో విజయలక్ష్మి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు