రాప్తాడు: సనప గ్రామములో కుర్మ వంశస్థుల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి జల్దీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సనప గ్రామంలో బుధవారం సాయంత్రం ఐదున్నర గంట సమయంలో స్థానిక గ్రామంలో కుర్మ వంశస్థుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి జెల్ది ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ వంశస్థులు సీనప్ప గణపతి తదితరులు మాట్లాడుతూ సనప గ్రామంలో ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి శ్రీశ్రీ చంద్రగుప్త రేణుక ఎల్లమ్మ అమ్మవారికి కురుమ వంశస్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అమ్మవారికి జల్దీ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సనప గ్రామంలో ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించామని కుర్మ వంశస్థులు సీనప్ప గణపతి తదితరులు పేర్కొన్నారు