కనిగిరి: పట్టణంలో విద్యార్థుల శాంతి ర్యాలీని ప్రారంభించిన కనిగిరి డిఎస్పి శ్రీధర్
కనిగిరి పట్టణంలో విద్యార్థులు గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ శాంతిరాలిని కనిగిరి డిఎస్పి శ్రీధర్ తన కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో మానవతా సభ్యులతో కలిసి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ జెండాలతో శాంతిరాలిని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ... పరస్పరం సోదర భావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని సూచించారు. కక్షలు, గొడవలకు పోకుండా సహుద్ బావ వాతావరణం లో ప్రతి ఒక్కరు మెలగాలన్నారు. సమాజంలో శాంతి, సామరస్యం ముఖ్యమన్నారు.