రాయదుర్గం: ఉత్సవాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : సీఐ వెంకటరమణ
వినాయక ఉత్సవాలు, మారెమ్మ జాతరల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ కోరారు. గుమ్మగట్ట పోలీసు స్టేషన్ లో ఎస్ఐ చిన్నరాయుడు ఆధ్వర్యంలో నిర్వాహకులతో సమావేశం జరిపి సూచనలు ఇచ్చారు. పోలీసులు, అధికారులతో సహకరించాలని కోరారు.