కనిగిరి: పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి పల్లకి సేవోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. పట్టణానికి చెందిన భక్తులు ఆలయానికి తరలివచ్చి, స్వామివారి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. కార్యక్రమం అనంతరం పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు