రాప్తాడు: అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి అనంతపురంలో రాప్తాడు జిల్లా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున
అనంతపురం జిల్లా కేంద్రంలో బుధవారం 11:20 గంటల సమయంలో రాప్తాడు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ వర్షాభావం దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల రుణాన్ని రద్దు చేయాలని పంట వేసి నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రాప్తాడు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.