కనిగిరి: పట్టణంలో వైసీపీ ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం
కనిగిరి పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి వైసిపి కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలుగువారి తగవకు నిలువెత్తు నిదర్శనం టంగుటూరి ప్రకాశం పంతులు అని, తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన మహోన్నత నాయకుడు టంగుటూరి అని కొనియాడారు.