మచిలీపట్నం: మంగినపూడి బీచ్లో మహాగణపతి ఉత్సవాలు: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
మంగినపూడి బీచ్లో 63 అడుగుల మహాగణపతి ఉత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ డీకే బాలాజి సమీక్ష నిర్వహించారు. భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, విద్యుత్ మరియు భక్తుల సౌకర్యాల కోసం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. 14 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో ట్రాఫిక్ నియంత్రణ, ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు.