మచిలీపట్నం: తురకపాలెంలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజా
మొవ్వ మండలం కోసూరు గ్రామం శివారు తురకపాలెంలో ప్రగతి పదంలో పామర్రు కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమార్ రాజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య కు అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.