మచిలీపట్నం: పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్దకు భారీగా చేరిన వరద నీరు
ప్రకాశం బ్యారేజ్ నుంచి 4.62 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో, పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్దకు నీరు చేరింది. ఇదే ప్రవాహం కొనసాగుతుందని బుధవారం ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద పెరిగినా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.