మచిలీపట్నం: పెదముత్తేవి గ్రామంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుమార్ రాజా
మొవ్వ మండలం పెదముత్తేవి గ్రామంలో తోడేటి అగ్గిరాముడు గారికి 20,524/-రూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే కుమార్ రాజా అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కింద బాధితులకు రెండున్నర కోట్లు అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేదల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలిపారు.