మచిలీపట్నం: నాగాయలంకలో వరద ఉద్ధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ద ప్రసాద్
నాగాయలంక లోవరద పరిస్థితి అంచనాకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రం పుష్కర ఘాట్ వద్ద కృష్ణానది వరద పరిస్థితిని ఎమ్మెల్యే పరిశీలించారు. అక్కడ అధికారులతో సమావేశమై వరద ఇంకా పెరిగితే చేపట్టే చర్యలపై చర్చించారు. ఆయన వెంట మాజీ ఏఎంసీ ఛైర్మన్ మండవ బాలవర్ధిరావు, టీడీపీ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత ఉన్నారు.