మచిలీపట్నం: కపిలేశ్వరపురంలో శ్రీరంగనాయక ఆంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురంలో శ్రీరంగనాయక ఆంజనేయ స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఆలయ అభివృద్ధికి ట్రస్టు పాలకమండలి సభ్యులు కృషి చేయాలని కోరారు. ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.