మచిలీపట్నం: శ్రీకాకుళం గ్రామం వద్ద కృష్ణా నదిలో భారీ వరద నీరు
ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం వద్ద కృష్ణా నదిలో బుధవారం భారీ వరద నీరు ప్రవేశించింది. ప్రకాశం బ్యారేజ్ నుండి 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నదిలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. పశువుల కాపరులు, పడవల యజమానులకు సూచనలు జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.