మచిలీపట్నం: గుడివాడలోని టిడ్కో కాలనీలో సీ 158 ఫ్లాట్లో చోరి
గుడివాడలోని టిడ్కో కాలనీలో సీ 158 ఫ్లాట్లో దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు ఓ ఇంటి తాళాలను పగులగొట్టి, స్విచ్ బోర్డులు, వైర్లు దొంగతనం చేశారని బాధితులు బుధవారం వాపోయారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టి, దొంగతనాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు కోరారు. టిడ్కో కాలనీ వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.