రాయదుర్గం: ఎమ్మెల్యే ను కలసి కృతజ్ఞతలు తెలిపిన డి.హిరేహాల్ జెడ్పిటిసి వన్నూరుస్వామి
కూటమి తరపున డి.హిరేహాల్ జెడ్పీటీసీగా గెలుపొందిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బోయ వన్నూరుస్వామి గురువారం రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులును మర్యాదపూర్వకంగా కలిశారు. తన గెలుపునకు సహకరించినందుకు కృతజ్ఞతగా ఘనంగా సన్మానించారు. గురువారం రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయనతో పాటు డీ.హీరేహాల్ మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులను ఘన మెజారిటీతో గెలిపించాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.