ఉరవకొండ: బెలుగుప్ప మండల వైయస్సార్సీపి జడ్పిటిసి అభ్యర్థి మీనుగ నరేంద్రబాబు విస్తృత ప్రచారం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల వైఎస్సార్సీపీ జడ్పిటిసి అభ్యర్థి నరేంద్రబాబు మండలంలోని గ్రామాల్లో విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రగుడి గ్రామంలో స్థానిక ఎంపీటీసీ అభ్యర్థి గొరువ ప్రమీల స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులతో కలసి జెడ్పిటిసి అభ్యర్థి విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలో ఇంటింటా వెళ్లి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదని వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటేశులు వేణుగోపాల్ నరిగన్న ఎర్రి స్వామి.