రాప్తాడు: రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో అనంత కరువుపై ఎమ్మెల్యేలు ఎందుకు నోరు మెదపలేదు అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో శనివారం నాలుగున్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బీడీఎస్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన ఒక సమస్య కూడా ప్రస్తావించకపోవడం బాధాకరమని అసెంబ్లీ వేదికగా సీఎం దృష్టికి జిల్లా సమస్యలు తీసుకువెళ్లే గొప్ప అవకాశాన్ని 14 మంది ఎమ్మెల్యేలు సద్దినాలు చేసుకోకపోగా కేవలం చంద్రబాబును పొగిడేందుకే సమయమంతా కేటాయిస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల పై పలు విమర్శలు చేశారు, ఈ సమావేశంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.