కనిగిరి: నామినేటెడ్ పోస్టులు, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి: కనిగిరి వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: నామినేటెడ్ పోస్టులు మరియు బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం చేతపత్రం విడుదల చేయాలని కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. గురువారం కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... వెనకబడిన వర్గాలు కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారు సామాజికంగా వెన్నుదన్నుగా నిలిచేలా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్లను బీసీలకు కల్పించి పాలాభిషేకాలు చేయించుకుంటుందని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో 50% రిజర్వేషన్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.