రాప్తాడు: ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన సీఐ హేమంత్ కుమార్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం 12 గంటల 15 నిమిషాల సమయంలో సీఐ హేమంత్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ హేమంత్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు 17న సాకే జయ ధనలక్ష్మి దేవి నివాసంలో 156 గ్రాముల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లడం జరిగిందని జయ ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శుక్రవారం ముగ్గురు నిందితుల అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఐదు గ్రాముల బంగారాన్ని ఒక మొబైల్ ఫోన్ మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగిందని 96.846 గ్రాముల బంగారం రికవరీ చేయాల్సి ఉందని ఇటికలపల్లి సర్కిల్ సిఐ హేమంత్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు.