కనిగిరి: కంబాల దీన్నే లో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పోలేరమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
పామూరు మండలంలోని కంబాల దీన్నే ఎస్సీ కాలనీలో రూ.20 లక్షల రూపాయల తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో నూతనంగా నిర్మించనున్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... గ్రామంలో శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను కేటాయించడం అభినందనీయమన్నారు. ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.