రాయదుర్గం: మున్సిపల్ చైర్మన్ సీటు అడుగుతున్నాం : జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ గౌడ
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ బలోపేతమవుతోందని రాయదుర్గం నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ మంజునాథ గౌడ అన్నారు. బుధవారం రాయదుర్గం పట్టణంలోని చౌడమ్మ గుడి ఏరియాలో వగ్గా రాము ఆధ్వర్యంలో 50 మంది జనసేనలో చేరారు. మంజునాథ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాయదుర్గం మున్సిపాలిటీ చైర్మన్ సీటు జనసేన అడుగుతోందని తెలిపారు. సవపది వార్డుల్లో పోటీకి జనసేన సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రాయదుర్గంలో జనసేన జెండా ఎగరవేస్తామని స్పష్టం చేశారు. పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, మండల అధ్యక్షులు హర్షవర్ధన్ పాల్గొన్నారు.