దర్శి: కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా కల్పించిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Sep 13, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని వైయస్సార్ పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసిపి జిల్లా అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలిపించేందుకు కృషి చేయాలి అన్నారు. పార్టీని కనిపెట్టుకొని ఉన్న కార్యకర్తలకు ఎన్నికల అనంతరం తగిన న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. పార్టీలో గుర్తింపు కలిగిన ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.