రాయదుర్గం: బాల్యంలో విద్యాభ్యాసం చేసిన పాఠశాలను సందర్శించిన శ్రీ విజయానంద తీర్థ స్వామీ
మైసూరు దత్త పీటం ఉత్తరాధికారి శ్రీ విజయానంద తీర్థ స్వామీజీ 42 ఏళ్ల తర్వాత రాయదుర్గంలో పర్యటించారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం పక్కన తాను బాల్యంలో విద్యాభ్యాసం చేసిన శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాఠశాలను శనివారం సందర్శించారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు ఆయన పేరుగల ఆనాటి రికార్డు ను చూయించడంతో సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ టంకశాల హనుమంతు, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డితో కలసి పాఠశాల విద్యార్థులకు బ్యాగులు అందజేశారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.