రాయదుర్గం: పట్టణంలో మూడు కళాశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు : మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి
విద్యార్థుల సౌకర్యార్థం రాయదుర్గం పట్టణంలోని మూడు కళాశాలల్లో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి తెలిపారు. ఈనెల 10 నుంచి 30వతేదీ వరకూ ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని వెంకటేశ్వర జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలల్లో ఆధార్ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఆయా కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఆధార్ నమోదు కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.