నారాయణపేట్: నారాయణపేటలో 24 గంటల కరెంట్ ఇవ్వండి - ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గవినోళ్ల శ్రీనివాస్
నారాయణపేట జిల్లాలో విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితులపై ఆందోళన వ్యక్తమైంది. దామర్గిద్ద మండలం బాపన్‌పల్లి సబ్‌స్టేషన్‌ను సందర్శించిన సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్, రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వాలని, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.