ఉరవకొండ: శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు పంచామృతాభిషేకాలు భజనలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో వెలసిన శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం స్వామి వారి మూలవిరాట్ కు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు పంచామృత, రుద్ర అభిషేకాలు, భజన కార్యక్రమాలను నిర్వహించారు. భజన బృందం పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.