గిద్దలూరు: గిద్దలూరు లో స్పెషల్ పోలీసులమని చెప్పి వృద్ధుడి వద్ద నుంచి బంగారం దొంగిలించిన దొంగలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా గిద్దలూరులో స్పెషల్ పోలీసులము అని చెప్పి ఓ వృద్ధుడి వద్ద నుంచి గుర్తుతెలియని దొంగలు బంగారాన్ని దోచుకు వెళ్లారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. కొండయ్య అనే వృద్ధుడికి అవగాహన కల్పిస్తున్నట్లు నటించిన యువకులు మూడు తులాల బంగారు ఉంగరాలను ద్విచక్ర వాహనం డిక్కిలో పెడతామని నమ్మించి రాయి పెట్టి తర్వాత బంగారంతో ఉడయించారు. ఆలస్యంగా గుర్తించిన వృద్ధుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిన్న ఇదే విధంగా కొమరోలు మండలంలో కూడా దొంగలు మహిళలకు అవగాహన కల్పిస్తున్నట్లు నటించి బంగారాన్ని దొంగిలించారు.