మార్కాపురం జిల్లా కంభం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో యాచకుడు గురువారం మృతి చెందాడు. మృతుడు కంభం మండలం లింగోజిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులను పిలిపించి మృతదేహాన్ని వారికి అప్పగించినట్లుగా పోలీసులు తెలిపారు. కొద్దిగా రోజుగా ఈ ప్రాంతంలో ఆశించుకుని తిరుగుతూ అనారోగ్యంతో మృతుడు మృతి చెందినట్లుగా ఎస్ఐ శివకృష్ణారెడ్డి తెలిపారు.